మౌలిక వసతుల కల్పనకు పాధాన్యత ప్రజాశక్తి – గాలివీడు / రాయచోటి జిల్లాలోని అన్ని లే అవుట్లలో గహ నిర్మాణ పూర్తికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత నిచ్చి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కషి చేస్తోందని ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. రాజాబాబు, కలెక్టర్ శ్రీధర్ చామకూరి లబ్ధిదారులతో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించడానికి మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ లే అవుట్లలో ఉన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తరువాత గహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని, ఆరు నెలల కాలంలో జిల్లాలో సుమారు 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశామని కలెక్టర్ గహ నిర్మాణ కార్పొరేషన్ ఎమ్‌డికి వివరించారు. అనంతరం రాయచోటి మండలం దిగువ అబ్బవరం, ఎపి మోడల్ స్కూల్ వద్దనున్న లే అవుట్లు, గాలివీడు మండలం గుర్రాల మిట్ట, ఉర్దూ పాఠశాల ఎదురుగా ఉన్న హౌసింగ్ లేఅవుట్‌లను వారు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటించి పరిశీలించారు. లేఅవుట్లలో పూర్తయిన ఇళ్లను, మౌలిక వసతుల కల్పన అంశాలను పరిశీలన నిమిత్తం ఈ సందర్భంగా ఆయా లే అవుట్లలో మంజూరైన ఇళ్లు ఎన్ని, పూర్తి చేసుకున్నవి ఎన్ని, ప్రగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ప్రస్తుతం పూర్తి చేసుకుని గహప్రవేశానికి సిద్ధంగా ఉన్న గహాలు ఎన్ని తదితర అంశాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా లే అవుట్‌లలో ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్ల పరిస్థితి, లేఅవుట్ మొత్తం విద్యుత్ సౌకర్యం ఉందా, విద్యుత్ సౌకర్యం కల్పించిన గహాలు ఎన్ని ఇంకను కల్పించాల్సినవి ఎన్ని, తాగునీరు పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. స్థానికంగా నివాసం ఉన్న లబ్ధిదారులతో మౌలిక వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య, అంతర్గత రోడ్ల సమస్యలను లబ్ధిదారులు గహ నిర్మాణ కార్పొరేషన్ ఎమ్‌డి, కలెక్టరుకు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా గహ నిర్మాణ కార్పొరేషన్ ఎమ్‌డి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి 2024 డిసెంబర్‌లోగా రాష్ట్రంలో లక్ష ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. లేఅవుట్లలో మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం దష్టి సారించిందని, త్వరలోనే నిధులు మంజూరు చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కషి చేస్తుందని పేర్కొన్నారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల్లను కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బిల్లులు కూడా త్వరితగతిన చెల్లిస్తున్నట్లు వివరించారు. అనంతరం వివిధ అంశాలలో లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివయ్య, ఇఇలు, డిఇలు, ఎఇలు తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.