విద్య,వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత

ప్రజాశక్తి -కనిగిరి : విద్య,వైద్య, రంగాల అభివద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కంచర్లవారిపల్లి జడ్‌పి ఉన్నత పాఠశాలలో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వారిలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఒ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గంటా వెంకట సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలోచించి తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్నారు. గొప్పలకు పోయి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తూ అప్పుల పాలు కావద్దని సూచించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట వాలంటీర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంచర్లవారిపల్లి హైస్కూల్లో సీబీఎస్‌ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కషి చేస్తానని తెలిపారు. పాఠశాలను ప్లస్‌ టుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనిగిరి ప్రాంతంలో పుట్టిన కోరమండల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గంటా వెంకట సుబ్బారెడ్డి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినంద నీయమన్నారు. కోరమండల్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ గంట వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ కంపెనీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను తాను పుట్టిన ప్రాంతంలో చేపట్టడం సంతప్తినిస్తుందని అన్నారు. విద్యాభివద్ధి కి ఎల్లప్పుడు తమ సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కోరమండల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గంటా వెంకటసుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కోరమండల్‌ కంపెనీ రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌ కెఎస్‌కె.చక్రవర్తి, జోనల్‌ మేనేజర్‌ హరి, జోనల్‌ హెడ్‌ తిరుపతిరావు, డివిజనల్‌ మేనేజర్‌ వీరాంజనేయులు , అశ్విని కుమార్‌ రడ్డి, అరునాధర్‌ రెడ్డి, సిబ్బంది నరసింహారావు, గ్రామ సర్పంచి పోతు రమణారెడ్డి , మాజీ ఎంపీపీ లు పోతు కొండారెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచి రెడ్డి, బాలు, ఓబుల్‌ రెడ్డి, నాగిరెడ్డి, పిచ్ఛాల శ్రీనివాసరెడ్డి, ఎంఒలు రామిరెడ్డి, శ్రీనివాస చారి, సంజీవ్‌, పాఠశాల హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️