ప్రజాశక్తి -భీమునిపట్నం : క్రీడలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రెండ్రోజుల పాటు జరుగనున్న ఆంధ్రా యూనివర్సిటీ అంతర్ డిగ్రీ కళాశాలల వాలీబాల్ పోటీలను బెలూన్లు ఎగరేసి ప్రారంభించారు. ఎయు పరిధిలోని విశాఖ, విజయనగరం జిల్లాల 35కాలేజీల నుంచి 35జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మంజుల అధ్యక్షత జరిగిన సభలో తహశీల్దార్ పి రామారావు, జోనల్ కమిషనర్ పిల్లి ప్రేమ ప్రసన్న వాణి, వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, ఎయు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్ విజయమోహన్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి గౌరీశంకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి, గంటా నూకరాజు, గొలగాని నరేంద్రకుమార్, పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంటా