కరెంట్‌ షాక్‌ తగిలి ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి

నందిగామ (ఎన్టీఆర్‌ జిల్లా) : వీరులుపాడు మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ ఎస్‌.పుల్లారావు కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. సేకరించిన వివరాల మేరకు … వెల్లంకి గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్‌ సల్లూరి పుల్లారావు (46) శుక్రవారం దాచవరం గ్రామంలో ఒక రైతు పొలంలో ఉన్న విద్యుత్‌ మోటారు పనిచేయకపోవడంతో ఆ మోటర్‌ ను పరిశీలిస్తుండగా విద్యుత్‌ షాక్‌ కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై అల్లూరు సబ్‌ స్టేషన్‌ ఎఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ … కనీసం స్థానిక లైన మెన్‌ కు కూడా తెలపకుండా మోటారును పరిశీలించడానికి వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️