బస్టాండులో ప్రయివేటు వాహనాలు..

ప్రజాశక్తి-త్రిపురాంతకం: మండలంలోని త్రిపురాంతకం ఆర్టీసి బస్టాండ్‌ ప్రైవేటు వాహనాలకు స్టాపింగ్‌ సెంటర్‌గా మారింది. త్రిపురాంతకం ప్ర ముఖ పుణ్యక్షేత్రం కావడం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్నూలు, అనంతపురం మీదుగా కర్ణాటకకు ప్రతిరోజు 70కి పైగా బస్సులు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ బస్సు లు దూర ప్రాంతాల నుంచి రావడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో నిలబడే వసతి ఉన్నప్పటికీ బస్టాండ్‌లోకి బస్సులు రాకుం డా రాత్రి సమయాల్లో బైపాస్‌ మార్గాన వె ళ్తూ ఉంటాయి. పగటి పూట బస్టాండ్‌ రోడ్డు పైన మాత్రమే బస్సులు నిలబడు తూ ఉండడంతో ప్రయాణికులు అనేక ఇ బ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుం డా రోజు సుమారుగా పది ప్రైవేటు వాహ నాలు బస్టాండ్‌లోనే ప్యాసింజర్‌లను ఎ క్కించుకొని వెళ్తూ ఉంటాయి. దీనివల్ల ఆ ర్టీసీ ఆదాయానికి గండి పడడంతో పాటు బస్టాండ్‌లో నుంచి రోడ్డు అవతలకు దాటాలంటే ఇబ్బందులే కాకుండా ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. ఆర్టీసీ ఉ న్నతాధికారులు ప్రజల ఇబ్బందులను గు ర్తించి ఆర్టీసీ అధికారిని నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

➡️