విద్యుత్‌ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలి

ప్రజాశక్తి-రాయచోటి విద్యుత్‌ రంగ సంస్థలను ప్రయివేటీకరణను ఆపాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (యుఇఇయు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.వి.రమణ పేర్కొన్నారు. విద్యుత్‌ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపి, ఉద్యో గులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ అఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా రమణ మాట్లాడుతూ విద్యుత్‌ రంగం ప్రయివేటీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న కాలంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతు న్నాయని, ఈ రంగాన్ని పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు అడు గుల వేస్తున్నాయని పేర్కొన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వ కార్యాల యాలకు, వ్యాపార సంస్థలకు ప్రీఫెయిడ్‌ మీటర్లను తీసుకువచ్చారన్నారు. త్వరలో గహాలకు కూడా తీసుకువస్తున్నారని తెలిపారు. మనిషికి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఎంత ముఖ్యమో అదే స్థాయిలో విద్యుత్‌ అనేది కూడా దైనందిన జీవితంలో ముఖ్యమైదని పేర్కొన్నారు. అలాంటి నిత్య అవసరమైన విద్యుత్‌ను ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ప్రజల తిరగబడాలని పిలుపునిచ్చారు. ఇదే పద్ధతి జరిగితే అటు రైతులకు గానీ, సామాన్య ప్రజలకు కానీ, సంస్థలో పని చేసే ఉద్యోగ కార్మిక వర్గానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. విద్యుత్‌ రంగం ప్రయివేటీకరణ ఆపాలని కోరారు. యుఇసిడబ్ల్యూయు డిస్కం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల పనిచేస్తున్న వారం దరినీ క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్ధను ప్రయివేటు వారికి అప్పజెప్పే ప్రయత్నం మానుకోవాలని, కార్మికుల హక్కులను కాపాడాలని, విద్యుత్‌ సంస్థను పరిరక్షించుకుంద్దామని నినాదాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యుఇఇయు నాయకులు రెడ్డప్ప, శ్రీనివాసులు నాయుడు, ఖాదర్‌ బాషా, చిన్న కృష్ణ, డివిజన్‌ అధ్యక్షులు నగేష్‌ గౌడ్‌, శ్రీధర్‌, విశ్వనాథ్‌, రవీంద్ర రెడ్డి,చిన్న, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️