ఆపాలిప్రజాశక్తి – రాయచోటి టౌన్ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఉప సంహరించుకుని ప్రభుత్వ రంగంలో ఉంచాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రయివేట్ పరిశ్రమలు నష్టాల బాటలో ఉన్నాయని, రూ.10 లక్షల కోట్లు రాయితీలిచ్చారని, అదే విధంగా వైజాగ్ స్టీల్ పరిశ్రమ నష్టంలో ఉంటే నిధులు కేటాయించి ఆదుకోవాలని అన్నారు. దశల వారిగా ప్రణాళిక ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేట్ పరం చేస్తున్నాయని ప్రజలు నిరుద్యోగులు కార్మికులు ఐక్యంగా ఉద్యమిం చాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేయకుండా తొలగించిన 4 వేల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదతం చేస్తామన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయిటీకరించడాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ప్రయివేటీకరణ ఆపాలని 1315 రోజులుగా విశాఖ నగరంలోనూ, రాష్ట్రంలోనూ పోరాటంసాగిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెడుతూ మోడీ ప్రభుత్వం ఫ్యాక్టరీని దారదత్తం చెయ్యడానికి కంకణం కట్టుకుని ‘పొమ్మనకుండా పొగపెట్టే’ పనులు చేస్తుందని విమర్శించారు. ప్రయివేటీకరణ నిలుపుదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. ట్రేడ్ యూనియన్లతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ప్రధాన మంత్రి దగ్గరికి రాయబారం తీసుకు వెళ్ళాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్ నరసింహులు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉపాధ్యక్షులు సి. రవికుమార్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు ఎం. విశ్వనాధ్, పూసపాటి రమణ, సుజాత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కష్ణప్ప, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ ,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సుదీర్ కుమార్, అద్యక్షులు హరి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి, నాగబసిరెడ్డి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి సలీం బాషా, సికిందర్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సిద్దమ్మ, అరుణ, ఇర్షాద్, కన్వీనర్ నాగేశ్వరి, నాయకులు మురళీ మోహన్ రాజు, అలీ, భాస్కర్, మాధవయ్య, నాయకులు తిరుమల, దేవా, మురళి రవి సుహాసిని పాల్గొన్నారు.
