ప్రజాశక్తి – కడప అర్బన్ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపేలా ఉందని వామపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు, లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక, రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు నాగ సుబ్బారెడ్డి, మనోహర్, అన్వేష్, దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సంపన్నులకు అను కూలంగా ఉందని తెలిపారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు వేసే బడ్జెట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వ్యవసాయం, ఉపాధి, కార్మికం సంక్షేమానికి కోతలు విధించిందని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులను బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణమని చెప్పారు. కార్పొరేట్ అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. మద్దతు ధరలు, రుణమాఫీ ప్రస్తావన లేదని తెలిపారు. పంటల బీమాకు నిధులు కేటాయింపు లేకపోవడం రైతులకు నిరాశ పరిచిందని చెప్పారు. అన్ని రంగాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఎరు వుల సబ్సిడీకి నిధులు కేటాయింపు లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమాకు నిధులు కేటాయింపు కోత పెట్టడం, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టంలో చెప్పిన విధంగా నిధులు కేటాయింపు లేకపోవడం అన్యాయమని తెలిపార పిఎం కిసాన్ పంటల బీమాను సవరణ చేసి ఉచిత పంటలు బీమా అమలు చేసి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జ్ ట్‌లో నిధులు కేటాయింపు లేకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు రామ్మోహన్, రామకష్ణారెడ్డి, చంద్రారెడ్డి, మద్దిలేటి, సురేష్, బాదుల్లా, విజరు, ఉదరు, రవి, కిరణ్, ప్రకాష్, వేణుగోపాల్ పాల్గొన్నారు. బద్వేల్ : ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో పోస్టాఫీసు వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె. నాగేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ పూర్తిస్థాయిలో కార్పొరేట్‌లు అనుకూలముగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఇరుపోతు ఓబులేసు, పులి శ్యాం ప్రవీణ్, పట్టణ కో – కన్వీనర్ పి.సి.కొండయ్య, పట్టణ నాయకులు సగిలి రాయప్ప, చెప్పలి సుబ్బరాయుడు, దియ్యాల హరి, కాకర్ల బాబయ్య, ముడియం చిన్ని, ఎస్.ప్రవీణ్ కుమార్, గంప సుబ్బారాయుడు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రవీణ్‌కుమార్, అశోక్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, ఫొటో-వీడియో గ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఎస్.కె మస్తాన్ షరీఫ్, శ్రామిక మహిళ సంఘం పట్టణ నాయకురాళ్లు షేక్ ఖైరూన్ బీ,గంప అనంతమ్మ, రత్తమ్మ పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు అన్నారు. బుధవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం ఎదుర్కొ ంటున్న సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టా లను రద్దు చేసి 4కోడ్‌లుగా తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో కడపలో స్టీల్ ప్లాంట్‌ఏర్పాటు చేయాలని ఉందని గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాలలో కడప ఉక్కు కోసం నిధులు కేటాయిం చకపోవడం అన్యాయమని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు ఎ. వినరు కుమార్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మి కుమారి, నిర్మల దేవి,భారతి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మైకేల్ ,చిట్టిబాబు ,శ్రీనివాసులు,నాగేంద్ర, బాష, నాగరాజు, లూక, దివాకర్ పాల్గొన్నారు.
