సమస్యల పరిష్కార రెవిన్యూ గ్రామ సభలు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని రైతులు వాటిని వినియోగించుకోవాలని తహసిల్దార్‌ పి.చిన్నారావు అన్నారు. మంగళవారం కపిలేశ్వరపురం మండలంలోని మాచర కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన రెవిన్యూ గ్రామ సభలో తహసిల్దార్‌ చిన్నారావు పాల్గని మాట్లాడారు. భూ సర్వేలో జరిగిన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ గ్రామ సభలో వివిధ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు . అనంతరం తహశీల్దార్‌ చిన్నారావు మాట్లాడుతూ గత నెల 19న ప్రారంభమైన రెవెన్యూ గ్రామసభలు మంగళవారం తో ముగిసేయ న్నారు . కార్యక్రమంలో సర్పంచ్‌ వాసంశెట్టి సునీత విష్ణుమూర్తి, ఉప సర్పంచ్‌ అడపా వేణి బాబ్జి, ఆర్‌ఐ అజ్జమ్మ, కార్యదర్శి చిన్న బాబు, గ్రామ విఆర్‌ఓ రాజరత్నం, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.

➡️