సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Oct 28,2024 21:32
ఫొటో : వినతిపతం అందజేస్తున్న నాయకులు

ఫొటో : వినతిపతం అందజేస్తున్న నాయకులు

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆత్మకూరు కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్‌ మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీలో స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె కాలం 16 రోజుల జీతం చెల్లించాలని, 2017-18 సంవత్సరానికి సంబంధించి ఒక్కో కార్మికుడికి రూ.24వేలు బకాయిలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్‌ కార్మికులకు పండగ అలవెన్స్‌ చెల్లించలేదని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ పెండింగ్‌ ఉన్నాయని, గత ఐదు సంవత్సరాల నుండి యూనిఫారం, సబ్బులు, నూనె ఇవ్వడం లేదని, అంతేకాకుండా పనిముట్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదనే ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మార్చి నెలలోపు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ డివిజన్‌ కార్యదర్శి ఆత్మకూరు నాగయ్య, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు గురవయ్య, రామయ్య, శీనయ్య, పి.శీనయ్య, చిన్న, వెంకాయమ్మ, కమలమ్మ, గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️