మాట్లాడుతున్న ఎంపిడిఒసమస్యలను వెంటనే పరిష్కరించాలిప్రజాశక్తి-విడవలూరు:మండల పరిధిలోని అన్ని పంచాయతీలలో ఎక్కడ ఇటువంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించాలని శనివారం విడవలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశంలో అన్నారు. ఎంపీపీ కాయల సౌందర్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం లో ఎంపీడీఓ నగేష్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని 15 పంచాయతీలలో మంచినీటి సదుపాయాలు వలన ఎవరు ఇబ్బంది పడకూడదన్నారు. వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు నీరు ఎక్కడ నిల్వ లేకుండా డ్రెయినేజీ వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు, మండలంలో ఏ పంచాయతీలో గాని చెత్త రోడ్లపై వేయరాదన్నారు. పారిశుధ్య కార్మికుల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చొరవతో సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
