కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ప్రోక్రిమెంట్‌ మేనేజర్‌ జి.శిరీష

పొదిలి (ప్రకాశం) : పొదిలి మండలంలోని పాములపాడు రైతు భరోసా కేంద్రంలో మంగళవారం ఉదయం పౌరసరఫరాల కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి ప్రోక్రిమెంట్‌ మేనేజర్‌ జి.శిరీష ముఖ్యఅతిథిగా పాల్గొని కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులను ఉద్దేశించి జి.శిరీష మాట్లాడుతూ …. రైతులు దళారీలతో మోసపోకుండా ప్రభుత్వం ఏ రోజు మార్కెట్లో ఎంత గిట్టుబాటు ధర ఇస్తుందో ఆ ధరకే రైతుల వద్ద నుండి కందులు కొనుగోలు చేస్తామని తెలిపారు. సంబంధిత అధికారులకు కందులను అప్పజెప్పిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడటం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు అపోహలకు లోనవ్వకుండా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం ఆమె రైతులతో కలిసి కంది పొలాలను పరిశీలించారు.

➡️