కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి

మాట్లాడుతున్న మల్లేశ్వరరావు

  గుంటూరు: ప్రపంచం ఎంతగా మారుతున్నా మన కుటుంబ వ్యవ స్థను కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని, ‘నా బలగమే నా బలం’ అని గుర్తించిన వారికి కుటుంబమే స్వర్గ ధామంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం అవగాహన కార్యాలయంలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసుడు విఎస్‌ఎన్‌ మల్లేశ్వరరావు మాట్లాడుతూ మానవత్వ మనుగడ సాదనలో కుటుంబ వ్యవస్థ ప్రదానపాత్ర పోషిస్తుందని, నేటి నవతరానికి సామాజిక ఆర్థిక సంరక్షణకు, క్రమశిక్షణకు అవసరమైన విలువలను అందించటానికి కుటుంబమే ప్రధాన సాదనం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల అందరికీ అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1993 మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సంగా ప్రకటించిందన్నారు. విద్యావేత్త ఆర్‌.వి.సింగరయ్య మాట్లా డుతూ సమాజంలో కుటుంబాల పాత్రను గుర్తించటం, అవి ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన సవాళ్లకు పరిష్కారాలు వెతకటం, బందాలను బలోపేతం చేయటం ఎంతో అవసరం అని ఐక్యరాజ్యసమితి భావించి, కుటుంబ జీవనానికి, శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తూ ఏటా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నిర్వహించటానికి పిలుపు నిస్తుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ఎ.హరి, జనార్థన రావు, అనిల్‌, కొండా శివరామిరెడ్డి పాల్గొన్నారు.

➡️