ఏటిగట్ల వద్ద ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు

ప్రజాశక్తి రామచంద్రపురం(కోనసీమ) : గోదావరికి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న సందర్భంగా ఇరిగేషన్‌ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఏ.గంగవరం మండలంలోని కోటిపల్లి నుండి సుందరపల్లి, కూల్ల ఏటుగట్టు బలహీన ప్రాంతాలను గుర్తించి సోమవారం ఇసుక బస్తాలు వేశారు. సుందరపల్లి , కూళ్ళ మధ్య కుమ్మరసవరం వద్ద ఏటి గట్టు కొన్నాళ్లుగా బలహీనంగా ఉంది ఎటిగట్లు వద్ద ఇసుక బస్తాలుతో పటిష్ట పరచాలని ఆదివారం సూచించిన మేరకు కె.గంగవరం తహశీల్దార్‌ రవీంద్రనాథ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ ఈ .జి. శ్రీనివాసరావు,డి. ఈ, కే .సుబ్బారావు , ఏ ఈ,రెహమాన్‌ , వీఆర్వో కష్ణ సాయి రెవెన్యూ అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో ఇసుక బస్తాలను వేసి ముందస్తు జాగ్రత్తగా రక్షణ చర్యలు చేపట్టారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని తహశీల్దార్‌ రవీంద్రనాథ్‌ ఈ సందర్భంగా తెలిపారు. గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పద్యంలో రెవెన్యూ అధికారులు వీఆర్వోలు అప్రమత్తంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

➡️