జర్నలిస్టులపై దాడికి నిరసన

ప్రజాశక్తి- పర్చూరు : జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వేముల తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు మీడియా కవరేజ్‌ కోసం వెళ్లిన విలేకర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావుపై టిడిపి నాయకులు పేర్లి శేషారెడ్డి, కళ్యాణ్‌ కుమార్‌ రెడ్డి విచక్షణా రహితంగా దాడిచేసినట్లు తెలిపారు. మైకులు, కెమెరాలు కూడా లాక్కున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని తెలిపారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జర్న లిస్టులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దారు అరుణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకర్లు కె.రవి, షేక్‌ అయూబ్‌, షేక్‌ రహమాన్‌, వై.శామ్యూల్‌, బి.నాగేశ్వరరావు, షేక్‌ బాషా, దళిత నాయకుడు ఎన్‌. కిషోర్‌, సిపిఎం నాయకుడు ఎం.డేవిడ్‌ పాల్గొన్నారు.కొల్లూరు : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వేముల మండలంలో నీటి సంఘాల ఎన్నికలను కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన విలేకర్లపై దాడి చేయడాన్ని ఖండిస్తూ స్థానిక విలేకర్లు నిరసన తెలిపారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ కార్యాల యంలో డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకర్ల పాల్గొన్నారు.రేపల్లె : జర్నలిస్టులపై దాడికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపల్లె తహశీల్దారు కార్యాలయం విలేకర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేముల మండల తహశీల్దారు కార్యాలయం వద్దకు మీడియా కవరేజ్‌ కోసం వెళ్లిన విలేకర్లపై టిడిపి నాయకులు భౌతికదాడికి పాల్పడినట్లు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే విలేకర్ల భద్రతకు కల్పించేందుకు ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. విలేకర్లపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దారు ఎం.శ్రీనివాసరావుకువినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకర్లు బొడ్డు మణివరకుమార్‌, శీలం సోమయ్య, నాగప్రసాద్‌, చింతల సురేష్‌, బడుగు నాగరాజు, పోలుబోయిన నాగబాబు, జాలాది అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️