ప్రధాని పర్యటన వేళ సిపిఎం నేతల అరెస్టులను ఖండిస్తూ .. నిరసన

ప్రజాశక్తి-రాంబిల్లి (అనకాపల్లి) : విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వస్తున్న నేపథ్యంలో … బుధవారం ముందస్తుగా సిపిఎం నాయకులను పోలీసులు గఅహ నిర్బంధించడం పట్ల రాంబిల్లి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జి దేవుడు నాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు అధికారం చేపట్టిన బిజెపి నాయకులు పదేళ్లు పూర్తయిన సొంతగనలు ఎందుకు కేటాయించలేదని, స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేస్తామని ఎందుకు కుట్ర పండుతున్నారని ప్రశ్నించారు. కాకినాడలో తిరస్కరించిన బల్క్‌ డ్రగ్స్‌ కంపెనీలను అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో ఎందుకు నెలకొల్పుతామని చెప్తున్నారు సమాధానం చెప్పాలన్నారు. అలాగే పూడిమడక ఎన్టిపిసి అయిన గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్‌ లో స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. పొల్యూషన్‌ పరంగా ఈ ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు, కార్మికులకు నష్టం లేకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారు చెప్పాలన్నారు. ఈరోజు జరుగుతున్న బహిరంగ సభలో ఈ సమస్యలపై మోడీ గారు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️