ఆర్‌టిసి కార్మికుల నిరసన

ప్రజాశక్తి-పొదిలి : తమసమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు. పొదిలి డిపో వద్ద గురువారం గేట్‌ మీటింగ్‌ బాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఆర్‌టిసి డిపో జాయింట్‌ సెక్రెటరీ దివాకర్‌ మాట్లాడుతూ త్వరితగతిన డ్యూటీ చార్ట్‌లు వేసి కండక్టర్‌, డ్రైవర్లకు లీవ్‌ పొజిషన్‌ కల్పించాలన్నారు. అసిస్టెంట్‌ సెక్రటరీ ఎస్‌కె. బాషా మాట్లాడుతూ సూపరింటెండెంట్‌ ధనమ్మ ఏకపక్షంగా ఓ యూనియన్‌కు కొమ్ముకాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యదర్శి పి.ఓబులేష్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను డిపిటిఒ దష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని తెలిపారు. ఈ నెల 15 నుంచి పై నాయకత్వ సూచన మేరకు కార్యచరణను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

➡️