108ను ప్రభుత్వమే నిర్వహించాలని నిరసన

Nov 14,2024 20:56

ప్రజాశక్తి-బొబ్బిలి :  108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని 108 ఉద్యోగుల సంఘం నాయకులు జి.వేణుగోపాలనాయుడు, ఎం.శోభన్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 108ను ప్రభుత్వమే నిర్వహించి, ఉద్యోగ భద్రత కల్పించాలని గురువారం బొబ్బిలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర వైద్య సేవలందిస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. 108ను ప్రభుత్వమే నిర్వహించి బకాయి వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు, రోజుకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ శ్రీను, ఎంపిడిఒ రవికుమార్‌కు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు మహేశ్వరరావు, రాంబాబు, అప్పారావు, వెంకటరమణ పాల్గొన్నారు.బొబ్బిలిరూరల్‌ : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంస్థ ఉద్యోగులు శ్రీనివాసరావు, కొండలరావు.. తహశీల్దార్‌ శ్రీను, ఎంపిడిఒ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తెర్లాం : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 108 ఉద్యోగులు.. గురువారం స్థానిక తహశీల్దార్‌ హేమంత్‌ కుమార్‌, ఎంపిడిఒ రాంబాబుకు వినతులు అందించారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో 108 ఉద్యోగులు బోను వెంకటరమణ, పిల్ల రమణ, పుప్పాల గౌరీ శంకర్‌, అమర రాజేష్‌, అప్పారావు పాల్గొన్నారు.

➡️