ప్రజాశక్తి – ముండ్లమూరు : పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధర తగ్గించాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు బిజెపి ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాధత్వం చేస్తూ వారిని కుబేర్లను చేస్తుందన్నారు. పేదలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్యాస్, పెట్రోల్, డీజిల్, రేట్లు తగ్గించక పోగా పెంచుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.హనుమంతరావు, జి.సత్యం, బి.రాజా రమేష్, జి.ఎర్రయ్య, పి.హనుమయ్య, జి.వెంకటయ్య, యు.నరసింహారావు, జి.శ్రీను బి.కోటేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
