భద్రత కల్పించండి : మాజీ ఎంపి నందిగం సురేష్‌ భార్య ఫిర్యాదు

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు) : తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ … వైసిపికి చెందిన మాజీ ఎంపి నందిగం సురేష్‌ భార్య బేబీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటివద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి రెక్కీ నిర్వహించారని ఫిర్యాదు చేశారు. రెక్కీ నిర్వహించిన వారిని గుర్తించి అరెస్ట్‌ చేయాలని మంగళవారం తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ లో బేబీలత ఫిర్యాదు చేశారు. తన భర్త నందిగం సురేష్‌ అరెస్ట్‌ అయిన దగ్గర నుండి తమకు భద్రత లేకుండా ఉందని, తన భర్త ఎంపి గా ఉన్న సమయంలో అనేక మందిని ఆదుకున్నారని, ఎక్కడ తమపై కేసులు పెడతారోననే భయం తో సాయం పొందిన వారు కూడా తమ ఇంటికి రావడానికి భయపడుతున్నారని బేబీలత వాపోయారు. తమకు రక్షణ కల్పించాని పోలీసులు, మీడియాని ఆశ్రయంచాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తమపై కక్ష, పగ ఉందని, కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాజధానిలో తమను ఉండనివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️