ప్రజాశక్తి-కొమరోలు : కొమరోలు మండలం కశినపల్లి గ్రామంలోని వద్ధులకు, అనాధలకు ని త్యావసర సరుకులు పంపిణీ చేశారు. వద్ధుల దినోత్సవం, గాంధీ జయంతి సందర్భంగా షేర్ ద విజన్ సంస్థ బుధవారం ఈ కార్యక్రమం చేపట్టింది. 1500 కిలోల బియ్యం, 50 కిలోల చక్కెర, 200 కిలోల కందిపప్పు, 100 కిలోల గోధుమపిండి, ఇడ్లీ రవ్వ, 150 నూనె ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వృద్ధాశ్రమాన్ని నిర్వహి స్తున్న ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అధ్యక్షులు బిజ్జం చిన్న నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ సెక్రెటరీ వీరబాబు మాట్లాడుతూ 5 నెలలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొమరోలు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ చైతన్య దీపక్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో షేర్ ద విజన్ సంస్థ ట్రెజరర్ సద్గుణ పాల్, సభ్యులు సుధీర్, హెచ్‌ఎం గిరిజ, ఆశా వర్కర్ దీవెనమ్మ, దాస్, చిన్న నరసింహులు పాల్గొన్నారు.