ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం మంగళాపురం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో అగ్రి ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన గొరిపర్తి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు పలుగు ఆర్థిక సహాయాన్ని అందించారు. మంగళాపురం గ్రామ సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు తండ్రి డొక్కు గురవయ్య చారిటబుల్ ట్రస్ట్ అందించిన పది వేల రూపాయలు, వి.ఎం గుప్తాఅందించిన నిత్యావసర సరుకులు, బట్టలను ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెడన నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్ , జనసేన పార్టీ నాయకులు లంకే సురేష్ వర్మ , రిటైర్డ్ డీస్పీ హరి రాజేంద్ర రావు , జనసేన నాయకులు గంగిశెట్టి బాబు రాజేంద్ర, అధ్యక్షులు వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.
