రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టుల కుదింపునకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక విద్యను తొమ్మిది రకాల పాఠశాలలను నిర్వహిస్తామనే పేరిట జారీ చేసిన జిఒ నెంబర్ 20 పేర్కొంది. ప్రభుత్వం వర్గీకరించిన తొమ్మిది రకాల కేటగిరీల్లో భాగమైన మోడల్ ప్రైమరీ పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌గా చూపించే ప్రయత్నం చేసింది. సర్‌ఫ్లస్ ఎస్‌జిటిలకు హెచ్‌ఎంలుగా ప్రమోషన్ల కల్పిస్తున్న పేరిట గ్రామీణ పాఠశాలలకు తరలించే డిమోషన్‌కు శ్రీకారం చుట్టడంపై జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక విద్య ప్రభావశీల మార్పులకు గురవుతోంది. కడప జిల్లాలో 2,816, అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో 1110 పాఠశా లలున్నాయి. ఫ్రైమరీ 1,872, మున్సిపల్ 82, ఎయిడెడ్ 66, ప్రయివేటు 723, మదరసాలు ఏడు పాఠశాలల చొప్పున ఉన్నాయి. కడప జిల్లాలో 3,05,663, అన్న మయ్య జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలలో 62,261 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జిఒ నెంబర్ 20 ద్వారా ప్రాథమిక విద్యను తొమ్మిది రకాల పాఠశాలలుగా వర్గీకరించింది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్‌ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హైస్కూల్స్ (6 నుంచి 10). హైస్కూల్స్ క్లాసెస్ (ఒకటి నుంచి 10). హైస్కూల్ ప్లస్ (6 నుంచి 12) పాఠశాలలు, హైస్కూల్ ఫ్లస్ (ఒకటి నుంచి 12 వరకు) పాఠశాలలు ఉన్నాయి. మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రభావితం అవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. మోడల్ ఫ్రైమరీ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాల్సి ఉంది.ఎక్కువ సంఖ్యలో ఒకటి, రెండు తరగతులను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా మిగిలిన మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు కిలోమీటరు దూరంలోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. సదరు గ్రామీణ విద్యార్థులు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు తరలిపోయేలా చేస్తోందనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. పంచాయతీకి ఒకటి చొప్పున పాఠశాల నిర్వహించాలనే డిమాండ్‌ను గాలికి వదిలేయడం ఆందోళన కలిగిస్తోంది. వైసిపి సర్కారు హయాంలో పాఠశాలల కుదింపుపై పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా కూటమి సర్కారు సైతం వైసిపి ఆరు పాఠశాలల తరహాలోనే రెండు మీడియం తరహాలో తెలుగు మీడియాన్ని సైతం తొలగించడం గమనార్హం. ఇంగ్లీష్ మీడియంలో బోధించడం, తరగతి గదుల్లో విద్యార్థులను 45 నుంచి 54 మందికి పెంచడం, మిగిలిన వారిని సరఫ్లస్ ఉపాధ్యాయులుగా చూపించడం, సదరు ఎస్‌జిటిలను హెచ్‌ఎంలుగా ప్రమోషన్ల పేరుతో గ్రామీణ ప్రాంతాల కు తరలించి డిమోషన్ అనుభవాల్ని కలిగిస్తోందనే వాదన వినిపిస్తోంది.ఉపాధ్యాయ పోస్టులను కుదించే యత్నమిది ప్రభుత్వ తొమ్మిది రకాల పాఠశాలల కాన్సెఫ్ట్ ఉపాధ్యాయుల కుదింపులో భాగమేనని సందేహాల్ని కలిగిస్తోంది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం ద్వారా మిగిలిన ఉపాధ్యాయులను సర్‌ఫ్లస్‌గా చూపించడం దారుణం. సర్‌ఫ్లస్ ఉపాధ్యా యులను ప్రమోషన్ల పేరిట గ్రామీణ ప్రాంతాలకు తరలించే డిమోషన్ చేయడం ఆందోళనకరం. – పి.మహేష్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప.ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించడమే మోడల్‌ప్రైమరీ పాఠశాలలో ఎక్కువగా ఒకటి, రెండు తరగతులు నిర్వహించడం ద్వారా మూడు, నాలుగు, ఐదు తరగతుల పిల్లలను కిలోమీటర్ దూరంలోని పాఠ శాలలకు వెళ్లేలా చేయడం ప్రయివేటును ప్రోత్సహించడం అవుతుందనడంలో సందేహం లేదు. – రవి, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి, కడప.ఉర్దూ పోస్టులు కొనసాగించాలి ఉర్దూ పాఠశాలల్లో పార్లల్ ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను కొనసాగించాలి. ఉర్ధూ పాఠశాలలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం దారుణం. – సయ్యద్ ఇక్బాల్, ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. తెలుగు మీడియాన్ని రద్దు చేయడం దారుణం తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం దారుణం. సెక్షన్‌కు 45 మంది విద్యార్థులు ఉండగా, పునర్వవస్థీకరణలో 53 మంది విద్యార్థులను కేటాయించడంతో ఉపాధ్యాయ పోస్టులు మిగిలి పోతున్నాయి. విద్యార్థుల నిష్పత్తిని 1.45గా ఉండాలి.- షేక్, జాబిర్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య.పేద విద్యార్థులకు అందని విద్య వైసిపి సర్కారు 117 జిఒ ప్రకారం ఆరు రకాల పాఠశాలలతో మార్పులు చేసింది. కూటమి సర్కారు 19, 20, 21 జిఒలను తీసుకుని తొమ్మిది రకాల పాఠశాలలతో ప్రభుత్వ విద్యారంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయగలరో చెప్పాలి. ఉపాధ్యాయ, విద్యార్థి, మేధోసంపత్తులతో చర్చలు చేసి పునర్వ వస్థీకరణ చేసి ఉంటే బాగుండేది.- నరసింహా, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య.
