ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర బృందం నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో ఎస్‌సి ఎస్‌టి కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఎస్‌టి కాలనీల్లో రోడ్లు డైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్యతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం ఒక బోరైనా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్‌సి కాలనీ వాసులు భూసమస్యలు పరిష్కారం కాలేదని మాభూములు ఆన్‌లైన్‌లో ఎక్కలేదని దాంతో పాస్ పుస్తకాలు రాలేదని బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఉచిత విద్యుత్ కూడా మాకు వర్తించడం లేదని దాంతో విద్యుత్ భారంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, జిల్లా నాయకులు జె జయంతిబాబు, సిపిఎం మండల కార్యదర్శి టి శ్రీకాంత్, యు వెంకటేశ్వర్లు, చిరంజీవి, నాగేశ్వరరావు, దాసరి ఆంజనేయులు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
