సమస్యల పరిష్కారానికే ప్రజా చైతన్య యాత్ర

ప్రజాశక్తి బాపట్ల : ప్రజా చైతన్య యాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య తెలిపారు. పట్టణంలోని ఉప్పరపాలెంలో సిపిఎం నాయకులు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సిపిఎం ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తోందన్నారు. ప్రధానంగా బాపట్ల పట్టణంలో మురుగునీటిపారుదల లేకపోవడంతో ప్రజలను దోమల వెంటాడుతుందన్నారు. దోమల నిర్మూలనకు అవసరమైన చర్యలు పురపాలక సంఘం చేపట్టేందుకు అవసరమైన ప్రజా పోరు కొన సాగించాలన్నారు. ప్రజల చైతన్యంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఈ నెల 16 వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, కె. నాగేశ్వరరావు, ఉప్పరపాలెం శాఖ సభ్యులు అశోది రంగారెడ్డి ,రాజు వెంకారెడ్డి, సిఐటియు నాయకులు శరత్‌, మహిళా పార్టీ జిల్లా నాయకురాలు సుభాషిణి, సిపిఎం సానుభూతిపరులు పాల్గొన్నారు. చీరాల : చీరాల పట్టణ పరిధిలోని 31వ వార్డు రోశయ్య కాలనీలో దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం చీరాల ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్‌. బాబూరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలపై ప్రజాపోరు యాత్రలో భాగంగా సిపిఎం బృందం రోశయ్య కాలనీని మంగళవారం సందర్శించింది. కాలనీలో ప్రజాలు ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు శిథిలావస్థలు చేరి కూలిపోయే స్థితిలో ఉందన్నారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీని పారుదల సౌకర్యం లేక పోవడంతో నీరు నిల్వ ఉంది దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భగవాన్‌దాస్‌,ఎల్‌. జయరాజు, కె.రాంబాబు పి. ఏసుపాదం పాల్గొన్నారు.

➡️