ప్రజాశక్తి-రాయచోటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశిం చారు.రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్‌ఎస్ హాలులో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పిజిఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్య లను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేయడం జరుగు తోందన్నారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభు త్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని, కాబట్టి అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యా దులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఎ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. సమస్యను పట్టుకొని పరిష్కారం కోసం ఎంతో ప్రయాసతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి సమస్యను సావధానంగా వినాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అధికారులకు అవగాహన ఉండాలని, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో, సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జెసి స్నాక్స్, వాటర్ బాటిల్, టీ సౌక ర్యాలను కల్పించారు. కార్యక్రమంలో జెసి ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌ఒ మధుసూ దనరావు, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.దళిత గ్రామాల చుట్టూ ఎతైన అడ్డుగోడలురాజంపేట అర్బన్: కూచివారిపల్లె గ్రామ పంచాయతీలోని డి.బి.ఎన్ పల్లె అరుంధతివాడ, ఊటుకూరు పంచాయతీలోని డి.బి.ఎన్.పల్లె దళితవాడలలో తమ గ్రామాల చుట్టూ పెత్తందార్లు ఎత్తైన గోడలు నిర్మించి తమను సామా జికంగా వెలివేతకు గురిచేస్తున్నారని ఆ రెండు గ్రామాల దళిత ప్రజలు ఎమ్మా ర్పీఎస్ నాయకులతో కలిసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ నైదియాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెలగచర్ల శివయ్య మాట్లాడుతూ పెత్తందార్లు అణచివేతకు దళితులు గురవుతూనే ఉన్నారని ఆవేదన చెందారు. గ్రామస్తులు మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన చౌదరి సామాజిక వర్గానికి చెందినవారు తమకు దారి కూడా లేకుండా రోడ్డును సైతం ఆక్రమించి తమ గ్రామం చుట్టూ ఎతైన అడ్డు గోడలు నిర్మిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చేమూరి వెంకటేష్, వడ్డెర సంఘం నాయకులు మదనపల్లి పెంచలయ్య, గ్రామ స్తులు కత్తి సుభాషిని, రమణ, వెంకటసుబ్బయ్య, రవి, బుజ్జమ్మ పాల్గొన్నారు.తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎమ్మెల్యే మదనపల్లె : తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఆయన అర్జీ దారుల నుండి వినతులను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని, ఎక్కువగా వీధిలైట్లు తాగునీటి సమస్య మీద వినతులు వస్తున్నాయని వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఇ, ఆర్‌ఐ, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.హోటళ్లలో నాణ్యత లోపించడంపై ఫిర్యాదుమదనపల్లె అర్బన్ : పట్టణంలో చికెన్, మటన్ దుకాణాలతోపాటు హోటల్స్, రెస్టారెంట్లలో నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారని, దీనివల్ల వినియోగదారులు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు ఆందో ళన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ సెల్‌లో సబ్ కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లోపించిన మాం సాహార పదా ర్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనఖీలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలు, వినియోగదారుల ఆహార భద్రతను పర్య వేక్షించాల్సిన అధికారులు మామూళ్ళ మత్తులో తనిఖీలకు దూరంగా ఉండడాన్ని ఆక్షేపించారు. దీనిపై సబ్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిపై సబ్ కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ టేకుపల్లి శ్రీనివాసులు, నాయకులు మోహన్, రెడ్డి ఈశ్వర, గణేష్, రెడ్డెప్ప, శ్రీరాములు పాల్గొన్నారు.
