సిపిఎం శాఖా మహా సభ లో నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపు
ప్రజాశక్తి.- విజయనగరం టౌన్ : దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజా స్వామిక చర్యలు కి వ్యతిరేఖంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలు చేపడతామని సీపీఎం పార్టీ నగరకార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు మంగళవారం విజయ నగరం రామకృష్ణా నగర్ శాఖా మహా సభ జరిగింది ఈ సందర్భంగా సీపీఎం జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో రాజ్యాంగం, దెబ్బ తింటుంది. అందుకు నిదర్శనం కొత్త న్యాయ చట్టాలు, అని అన్నారు. మరో వైపు అధిక ధరలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రాల హక్కులు కొల్ల గొడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీ కరణ చేసి అదాని, అంబానీ సేవలో ఉన్న మోడీకు దేశం , ప్రజలు గురించి ఆలోచించే తీరిక లేదని అన్నారు. ఆంధ్రకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు నోచుకోలేదు అని అన్నారు అందుకే ప్రజా సమస్యలకి పోరాటాలే పరిష్కారం అన్నారు.రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోయింది అని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ గారు, శాఖా కార్య దర్శి ఎం. జగదంబ , శాంతమూర్తి తదితరులు పాల్గున్నారు.
తీర్మానాలు
—————-
1. నివాసమున్న చోటే పట్టలిచ్చి ఇళ్లు కట్టాలి. కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి
3. నగరంలో అర్బెన్ హెల్త్ సెంటర్లో డాక్టర్లు , స్టాఫ్ తగినంత మందిని
4. ఏర్పాటు చేయాలి
5. ప్రభుత్వ హాస్పటిల్ మా ప్రాంతంలో ఉన్నది.దీనిలో హార్ట్, యురాలజీ , న్యూరాలజి, కేన్సర్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
6. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వేయాలనే ప్రతి పాదన విరమించి కోవాలి నీ తీర్మానాలు చేయడం జరిగింది.