ప్రజాశక్తి – సీతమ్మధార :ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా ప్రజాశక్తి తెలుగు దినపత్రిక పనిచేస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు అన్నారు. గురువారం రామాటాకీస్ దరి జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో 2025ప్రజాశక్తి కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా ప్రజాశక్తి దినపత్రిక కృషి చేస్తోందని కొనియాడారు. రానున్న కాలంలో ప్రజాశక్తి మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జీవన్ రాణి కూడా పాల్గొన్నారు.
పజాశక్తి కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న డిఎంహెచ్‌ఒలు