ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్క రించబడాలని, మండలాలలో ఎటువంటి సమస్యలు ఉన్న ఉన్నా, దష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఆర్‌డిఒతో పాటు డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌ఎల్‌ఎ పరిధి దాటిన సమస్యలు, సిసిఆర్‌సి కార్డులు తదితరు అంశాలపై దష్టి సారించి త్వరగా వాటన్నిటిని పరిష్కరించాలన్నారు. వారం వారం మండల తహశీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చాలని ఆర్‌డిఒను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డిఒ మోహన్‌రావు, డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ కలెక్టర్‌ శ్రీధర్‌ పట్టణంలోని సాతపల్లి అరుంధతి వాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ కేంద్రంలోని సూపర్వైజర్‌, ఉద్యోగులను వివిధ విషయాలపై ప్రశ్నించారు. 13 మంది పిల్లలకు గాను ముగ్గురు పిల్లలు మాత్రమే ఉండడం, మధ్యాహ్నం 12 అయినప్పటికీ భోజనాన్ని తయారు చేయకపోవడం, రిజిస్టర్‌ లను సవ్యంగా నిర్వహించకపోవడం పట్ల అంగన్వాడీ ఉద్యోగుల పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ సూపర్వైజర్‌ కేంద్రాలను తనిఖీ చేయకపోవడం పట్ల ఆమెపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సూపర్వైజర్‌, కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. త్వరలో ఇదే అంగన్వాడీ కేంద్రానికి మళ్ళీ వస్తానని, పూర్తిస్థాయిలో అంగన్వాడీ కేంద్రం నిర్వహించబడాలని ఆదేశించారు. ఆర్‌డిఒ, తహశీల్దార్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆర్‌డిఒ మోహన్‌రావు, డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️