ప్రజాశక్తి కొత్తపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని టిడిపి మండల నాయకులు శివారెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని జి వీరాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ ఇది మంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారి నాగేశ్వరమ్మ టిడిపి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం పోస్టర్లు అతికించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సెక్స్ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులకే ప్రజల చేత మంచి ప్రభుత్వంగా పిలవబడుతుంది అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగే ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇన్చార్జి ఏఈ పాండు నాయక్ సచివాలయ అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
