ప్రజాశక్తి-దర్శి : దర్శి పట్టణంలోని 18వ వార్డులో శనివారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. డాక్టర్ లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్‌లు తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ, సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తూ, ఓ వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. గత వైసిపి పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి అధోగతిపాలు చేశారు. సంక్షోభాన్ని అధిగమిస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.