ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : పితృ వియోగంతో బాధపడుతున్న కడియం మండలం బుర్రిలంక కు చెందిన మాజీ సర్పంచ్ గట్టి నరసయ్య,గట్టి సుబ్బారావు కుటుంబ సభ్యులను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి బుధవారం పరామర్శించారు. తొలుత దివంగత గట్టి సత్యన్నారాయణమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సత్యనారాయణమూర్తి రాజకీయంగా ఎందరికో ఆదర్శనీయులని కొనియాడారు.సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నిజాయితీగా సేవలందించారని, ఆయన స్పూర్తి తో ఆయన కుమారులు కూడా ప్రజాజీవితంలో కొనసాగడం అభినందనీయం అన్నారు.గట్టి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆమె వెంట కూటమి నాయకులు ఆకుల శ్రీధర్, మార్గాని సత్యనారాయణ, పుల్లా రామారావు, రత్నం అయ్యప్ప, గెడ్డం శివ, పంతం గణపతి, పాటం శెట్టి సూర్యచంద్రరావు, బరుసు సుబ్రమణ్యం, మల్లు శివ తదితరులున్నారు.
