మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు

బోనిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ప్రజాశక్తి -ఆనందపురం: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధరను అందిస్తుందని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం మండలంలోని బోని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పంట కొనుగోలు,డబ్బులు చెల్లింపుపై అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌అశోక్‌ మాట్లాడుతూ కల్లాల్లోనే ధాన్యం తేమ శాతం తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు వెళ్లే వరకు జిపిఎస పర్యవేక్షణణ ఉంటుందన్నారు. పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీలత మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి నగదు మూడు రోజుల్లోనే వారి ఖాతాలకు జమ చేస్తామన్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చేందుకు రవాణా, గోనె సంచులు, కూలీ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సాధారణ రకం ధాన్యం క్వింటాళ్లకు రూ.2300, గ్రేడ్‌ ఏ రకం ధాన్యాన్ని రూ. 2320 ప్రభుత్వం మద్దతుధర నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో భీమిలి ఆర్‌డిఒ సంగీత్‌మాధుర్‌, డిఎస్‌ఒ వి.భాస్కరరావు, డిసిటిఒ టి.ప్రవీణ, డిఎఒ కె అప్పలస్వామి, ఎపిఎంఐపి డిఎం మన్మధరావు, భీమిలి ఎడిఎ బొడ్డేపల్లి విజయప్రసాద్‌, ఎఒలు సిహెచ్‌. సంధ్య రత్నప్రభ, బి శివకోమలి, కంటుభుక్త రామానాయుడు, స్థానిక మాజీ సర్పంచ్‌ సురాల సత్య వరప్రసాద్‌, నాయకులు బిఆర్‌బి.నాయుడు, తాట్రాజు అప్పారావు, గన్‌రెడ్డి రమేష్‌, బంటు చిన్న, బి చంటి, మీసాల సత్యనారాయణ, కర్రోతు సత్యం, అంగటి రాము, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు

➡️