పొగాకు బేళ్లు కొనుగోలు

Jun 8,2024 21:56
ఫొటో : వేలం నిర్వహిస్తున్న వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌

ఫొటో : వేలం నిర్వహిస్తున్న వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌
పొగాకు బేళ్లు కొనుగోలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు వేలం కేంద్రానికి పలు గ్రామాలకు చెందిన రైతులు 750పొగాకు బేళ్ళను వేలం కేంద్రానికి తీసుకురాగా.. వీటిలో 638పొగాకు బేళ్ళను పలు కంపెనీలకు చెందిన వ్యాపారస్థులు కొనుగోలు చేశారని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. వివిధ కారణాలతో 83పొగాకు బేళ్ళను తిరస్కరించారన్నారు. వీటిలో ఎన్‌ఎస్‌ 34 ఎన్‌ బి 33 సిఆర్‌ 16ఉన్నాయని, అధిక బరువుతో ఉన్న 20 పొగాకు బేళ్లను వేళానికి తిరస్కరించారని తెలిపారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.331కాగా కనిష్ఠ ధర రూ.204, సగటు ధర రూ.265.18 నమోదు కాగా వేలంలో 24మంది కంపెనీ వ్యాపారస్తులు పాల్గొన్నారన్నారు.

➡️