ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగుజాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు అనిన నందమూరి తారక రామారావు అని కేంద్ర మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా … విజయనగరం పట్టణ కేంద్రంలో కోట జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …. తెలుగు జాతికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు ప్రజా సంక్షేమమే గాయంగా పార్టీని స్థాపించి పునాదికాలంలోనే అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ అన్నారు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రిజర్వేషన్ తీసుకువచ్చిన నాయకుడు విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత కల్పించిన నాయకుడు అన్నారు. గత ఐదేళ్లలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరం ఎప్పుడూ చూడలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ కార్యదర్శి గంటా పోలినాయుడు, మహిళా పార్లమెంట్ టిడిపి కార్యదర్శి అనురాధ బేగం, విజయనగరం మాజీ మున్సిపల్ చైర్మన్ కనకమహలక్ష్మి, మాజీ ఎంపీపీ కంది సాయి జగ్గారావు, నియోజకవర్గ నాయకులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
