రాక్షస పాలనకు అంతం : ‘పుత్తా’

ప్రజాశక్తి-చెన్నూరు రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తుందని విజయం తెలుగుదేశం పార్టీ దేనని తమ గెలుపు కోసం పనిచేసిన చెన్నూరు మండలం ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కమలాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తానరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం చెన్నూరు గోసుల కల్యాణ మండపంలో కతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెంట్లు ప్రతి బూత్‌లో ఉండి పార్టీ కోసం కష్టపడి పని చేశారని, విజయం మనలను తప్పక వరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.. టిడిపి గెలుపు కోసం ఎండను, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కషిచేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కల్లూరు విజయభాస్కర్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇందిరెడ్డి శివారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రామకోటి రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్జి వెంకట సుబ్బారెడ్డి (బుజ్జన్న,) రాష్ట్ర రైతు సంఘం నాయకులు గుమ్మల్ల మల్లికార్జున్‌రెడ్డి సీనియర్‌ మైనార్టీ నాయకులు షబ్బీర్‌ హుస్సేన్‌ మండల ఉపాధ్యక్షుడు కుంచం రామక ష్ణారెడ్డి, పొట్టి పాటిరాణా ప్రతాప్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

➡️