ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం (కడప) : బ్రహ్మంగారి మఠం మండలంలోని నాగిశెట్టిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కానాల మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రియతమ నాయకుడు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పై అభిమానంతో సంక్రాంతి సంబరాలలో భాగంగా యువతకు మంచి ఉత్తేజమిచ్చేలా ప్రీమియర్ లీగ్ టి 10 మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ టోర్నమెంట్ ను బుధవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి,మండల యువ నాయకులు కణాల మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా పుట్టా ప్రీమియర్ లీగ్ టి 10 క్రికెట్ ప్రారంభించారు.ఈ పోటీలో తలబడేందుకు 30టీమ్ లు రావడం జరిగింది. మొదటి ఫ్రైజ్ 50000వేలు.
స్పాన్సర్ – టిడిపి యువనాయకులు కానాల మల్లికార్జున రెడ్డి,రెండో ఫ్రైజ్ 30000వేలు
స్పాన్సర్ – టిడిపి మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి,మూడో ఫ్రైజ్ 10000వేలు
స్పాన్సర్ – టిడిపి మండల నాయకులు ఎల్లటూరు సాంబ శివారెడ్డి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎత్తపు ఈశ్వర్ రెడ్డి, సుధాకర్, పూజ శివయ్య, నాయుడు, పుటాల శివ, తదితరులు పాల్గొన్నారు.