ప్రజాశక్తి-బొబ్బిలి : అన్న క్యాంటీన్‌లో నాణ్యమైన టిఫిన్, భోజనాలు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను శుక్రవారం కమిషనర్ సందర్శించి, టిఫిన్ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లో మెనూ అమలు చేయాలని, నాణ్యత లోపిస్తే చర్యలకు సిఫార్సు చేస్తామని తెలిపారు. సకాలంలో విధులకు హాజరవ్వాలి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సకాలంలో విధులకు హాజరు కావాలని కమిషనర్ రామలక్ష్మి సూచించారు. మున్సిపల్ శానిటేషన్ కార్యాలయాన్ని కమిషనర్ తనిఖీ చేసి మస్తర్ రికార్డును పరిశీలించారు. వార్డుల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు సకాలంలో విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.పార్కు సందర్శనరాణి మల్లమ్మదేవి మున్సిపల్ పార్కును కమిషనర్ రామలక్ష్మి సందర్శించారు. పార్కులో మొక్కలకు నీరు పోసి, గ్రాస్ కటింగ్ కోసం ఇద్దరు కార్మికులు, సూపర్‌వైజర్‌ను నియమించాలని మున్సిపల్ ఎఇ గుప్తాను ఆదేశించారు. పార్కును సుందరంగా ఉంచాలన్నారు.