రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి : కమలాపురం సహాయ సంచాలకులు ఏవి.నరసింహారెడ్డి

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కమలాపురం సహాయ సంచాలకులు ఏవి. నరసింహారెడ్డి డీలర్లకు సూచించారు. మండలంలోని విత్తన దుకాణాలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డితో కలిసి కమలాపురం ఎడిఏ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఏ మాట్లాడుతూ …. జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన దుకాణాల్లో లైసెన్సులు, స్టాక్‌ రిజిస్టర్లలు, బిల్లు పుస్తకాలు, స్టాక్‌ బోర్డులు, గోడౌన్‌ స్టాక్‌ పాయింట్లను పరిశీలించినట్లు చెప్పారు. దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. కొనుగోలు చేసిన వాటికి నగదు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఎఒ మాట్లాడుతూ … వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన వాటిని మాత్రమే రైతులకు అమ్మాలన్నారు. కాల పరిమితి ముగిసిన విత్తనాలను రైతులకు విక్రయిస్తే విత్తన నియంత్రణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం విత్తన వ్యాపారాలు నిర్వహించాలని తెలిపారు.

➡️