ప్రజాశక్తి – కడప అర్బన్ కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్‌లో శుక్రవారం వామపక్ష కార్మిక రైతు సంఘాల నాయకులు క్విట్ కార్పొరేట్స్ ఇండియా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వామపక్ష కార్మిక, రైతు సంఘాల నాయ కులు నాగ సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, దస్తగి రిరెడ్డి, సుబ్బారెడ్డి, అన్వేష్ మాట్లాడారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీల నుంచి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా డే సందర్భంగా నిరసన చేపట్టామని తెలిపారు. 1942, ఆగస్టు 9న ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశం విడిచి వెళ్లి పోవాలంటే క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టారని చెప్పారు. ఆ స్ఫూర్తితో రైతుల వ్యవసాయాన్ని, కార్మిక హక్కులను కాలరాస్తున్న కార్పొరేట్ కంపె నీలు దేశ సంపదను లూటీ చేస్తున్న బడా కార్పొరేట్ కంపెనీలు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కార్పొ రట్స్ క్విట్ ఇండియా నినాదంతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరే టీకరించే విధానాలను అమలు చేస్తోందని విమర్శి ంచారు. దేశంలో విత్తన వ్యాపారం అంతా మోన్ శాంటో, కార్గిల్ లాంటి బహుళ జాతి కంపెనీ చేతుల్లో ఉందని చెప్పారు. రైతులను రక్షించే విత్తన చట్టం లేదన్నారు. పంటల బీమా పథకాన్ని కార్పొ రట్ కంపెనీలకు కట్టబెట్టారని విమర్శించారు. వసూలు చేసిన ప్రీమియంలో 80 శాతం లాభాలు పేరుతో కంపెనీలు దోచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలపై విధించే పన్నును 30శాతం నుంచి 20 శాతం తగ్గించారని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పరికరాలపై 18 శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించడం దారుణమన్నారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసు కురావాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవ సాయ రంగానికి భారీగా నిధుల కోత పెట్టడం దారుణమన్నారు. ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులు కోత పెట్టి బడా పారిశ్రా మికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వడం ఇదేనా వికసిత్ భారత్ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పన్నులు భారం తగ్గించి ప్రభుత్వ ఆదాయం కోసం కార్పొరేట్ కంపెనీలపై పన్నుల భారం పెంచాలని కోరారు. సమావేశంలో రైతు కార్మిక సంఘాల జిల్లా నాయకులు బాదుల్లా, వెంకట సుబ్బయ్య, చంద్రారెడ్డి, మద్దిలేటి, మున్సి పల్ కార్మిక సంఘం నాయకుడు సుంకర రవి, సుబ్బరాయుడు, మల్లికార్జున, మహిళా సంఘం నాయకులు భాగ్యమ్మ, రైతు సంఘం జిల్లా నాయ కులు గోపాలకష్ణయ్య, బాలచంద్రయ్య, రంగారెడ్డి, చిన్న సిద్దయ్య, యానాదయ్య పాల్గొన్నారు.పోరుమామిళ్ల : పట్టణంలోని అంబద్కేద్ భవనం ముందు కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహి ంచారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ కార్మిక రైతు సంఘాల నాయకులు ఎన్‌న్.భైరవ ప్రసాద్, బి .లక్ష్మీదేవి, బసిరెడ్డి లక్ష్మీదేవి,అంగన్వాడీ నాయ కులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులా పురం విజయమ్మ, మేరీ , దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, లావణ్య పాల్గొన్నారు.
