ప్రజాశక్తి – పంగులూరు : రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్‌టిసి అధికారులు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అద్దంకి ఆర్‌డిసి డిపో సిఐ ఎస్‌కె.మహబూబి మాట్లాడుతూ విద్యార్థులు క్షేమకరమైన ప్రయాణాలు పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రయాణికుల సంక్షేమం కోసం ఆర్‌టిసి అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చందలూరు గిరిజ, ఆర్‌టిసి డ్రైవర్లు సుధాకర్, రత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
