ప్రజాశక్తి – వేముల : వేముల మండలం నల్లచెరువు పల్లె రైతు సేవా కేంద్రం పరిధిలోని రబి సీజన్ కి సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియకు సంబంధించిన గ్రామసభను స్థానిక మండల వ్యవసాయ అధికారి మరియు సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా రబి సీజన్లో పంట నమోదు చేసుకున్న రైతులు వివరాలను స్థానిక రైతు సేవ కేంద్రం ఇంచార్జి నాగ సుదర్శన్ రైతులు వారి వివరాలను చదివి వినిపించారు. దీనికి సంబంధించిన రైతు జాబితా వివరాలను రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించడం జరిగింది రైతులకు ప్రదర్శించిన జాబితాలోని ఏమైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల గడువు లోపుగా అభ్యంతరాలు తెలపవలసిందిగా వివరించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి వి. చెన్నా రెడ్డి మాట్లాడుతూ వేముల మండల వ్యాప్తంగా ఈ రబీ సీజన్ లో 3778 మంది రైతులు 11555 ఎకరాలలో పంట నమోదు చేసుకున్నారని తెలిపారు. పంట నమోదు చేపించుకున్న 3775 మంది రైతులకు గాను 3685 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకున్నారు. పంట నమోదు తో పాటు ఈ కేవైసీ చేపించుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా, పెట్టుబడి రాయితీ, మద్దతు ధరకు పంటలు కొనుగోలు వర్తిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి మరియు టెక్నికల్ వ్యవసాయ అధికారి సునీల్ కుమార్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
