ఆనందపురం : ఆనందపురం మండలం వేములవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ వర్థంతిని నిర్వహించారు. వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వరరావు రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కె.సుభాషిణి, ఉపాధ్యాయులు కె.లక్ష్మణరావు, టి.పద్మజ, రామయ్యమ్మ, స్వచ్ఛంద సేవకుడు కోరాడ రమణ పాల్గొన్నారు.విద్యార్థులకు వ్యాస రచన పోటీలు తగరపువలస : ప్రముఖ రచయిత విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్థంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై భీమిలి మండలం సింగనబంద పంచాయతీ, కృష్ణంరాజుపేట ఎంపియుపి పాఠశాలలో బుధవారం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. జాతీయ గీతం జన గణ మనను రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారని ప్రధానోపాధ్యాయులు జి.సత్యనారాయణ తెలిపారు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకానికి నోబెల్ బహుమతి లభించినట్లు వివరించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
