ప్రజాశక్తి -గాజువాక : రైల్వే వేగన్ వర్క్ షాప్ వర్కర్లకు జిఒ ప్రకారం జీతాలు చెల్లించాలని ఆల్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు డిమాడ్‌చేశారు. వడ్లపూడి రైల్వే వేగన్ వర్క్ షాపు వద్ద సోమవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 10వ తేదీ లోపు జీతాలు చెల్లించాలని, ప్లేసిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ వర్కర్స్ చేసిన పనికి కాంట్రాక్టు కార్మికులు జీతాల ఇవ్వటం, కాంట్రాక్ట్ కార్మికులకు జిఒ ప్రకారం ఇవ్వకపోవడం దుర్మార్గమని అని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సిఐటియు కార్మికులకు అండగా ఉంటదని భరోసా ఇచ్చారు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారని, వారి మద్దతుకు మీకు ఉంటుందని తెలిపారు. రైల్వే మినిస్టర్‌కు పార్లమెంట్ ఎంపీలు, డిఆర్‌ఎంకు వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్ర రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి వి.నరసింహ మాట్లాడుతూ, రైల్వే వేగన్ వర్క్ షాప్ కార్మికులు పనిచేయట ద్వారా, కాంట్రాక్టర్లు రూ. లక్షల్లో సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ వర్కర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రాంబాబు మాట్లాడుతూ, సేఫ్టీ ప్లే షిప్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిని సిఐటియు చూస్తూ ఊరుకోదని భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివి.రాజు, కె.అవతారం, వెంకటేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.
