బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి : రాజోలు ఎస్‌ఐ బి.రాజేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని రాజోలు ఎస్‌ఐ బి.రాజేష్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం తమ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎక్కడా బాణసంచా పేలుళ్లు జరగకుండా ప్రశాంతంగా దీపావళి పండగ చేసుకునేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. బాణసంచా విక్రయాల సమయంలో వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలని, సామగ్రి భద్రపరిచిన గొడౌన్లు, దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ఇసుక, ఫైర్‌ ఇంజిన్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలని, ఒక్కో దుకాణానికి 5 నుంచి 10 అడుగుల దూరం పాటించాలని సూచించారు. పరిమితికి మించి మందుగుండ్ల సామగ్రి నిల్వ ఉంచకూడదన్నారు. అనుమతులు లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా చర్యలు తప్పబోవని ఎస్‌ఐ హెచ్చరించారు.

➡️