మలేరియా వ్యతిరేక మాసోత్సవం పై ర్యాలీ

Jun 11,2024 15:56 #Kurnool, #maleria, #Tuggali

ప్రజాశక్తి-తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి లో మంగళవారము వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మలేరియా వ్యతిరేక మా సోత్సవం పై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో ఆశా డే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి జూన్ 30 తేదీ వరకు అన్ని గ్రామాలలో మలేరియా వ్యతిరేక మా సోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైందని, అంటూ వ్యాధులు ప్రజల కు సోకకుండా ఈ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గర్భవతుల ను క్రమ పద్ధతిలో ఆసుపత్రికి తీసుకువచ్చి వారికి వైద్య పరీక్షలు చేయించే బాధ్యత ఆశా కార్యకర్తలు తీసుకోవాలన్నారు. గర్భవతులు రక్తహీనతకు గురికాకుండా ఉండే విధంగా చూడాలన్నారు. కాన్పు సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పు అయ్యేవిధంగా చూడాలని ఆయన ఆశా కార్యకర్తలకు తెలిపారు .గర్భవతులు కాన్పు అయ్యే వరకు తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య స్థితిగతులను ఆశాకారకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్ కుల శేఖర్, సిహెచ్ఓ అన్నపూర్ణ, పిహెచ్ఎన్ సరస్వతమ్మ , సూపర్వైజర్లు వెంకట రమణయ్య, స్టాఫ్ నర్స్ లు, హెల్త్ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️