ప్రజాశక్తి – కడప వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. నభికోట నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రారంభమై కడప పాత బస్టాండ్, నాగరాజు పేట, సిఎస్‌ఐ, ఎన్‌టిఆర్ సర్కిల్ మీదుగా సెవెన్ రోడ్స్ సర్కిల్ వరకు సాగింది. టిడిపి, జనసేన, బిజెపి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. వక్ఫ్ బోర్డు బిల్లుకు టిడిపి, జనసేన మద్దత్తు ఇవ్వడం హేయమైన చర్య అని అన్నారు. బిజెపి ప్రభుత్వం కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు తమ ముస్లిం మైనార్టీల ఆస్తులు అన్నారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును రద్దు చేసేంత వరకు పోరాటాలు చేస్తాం అని ఈ సందర్భంగా జెఎసి నాయకులు హెచ్చరించారు. ర్యాలీలో భారీగా ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనార్టీలు, ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
