ఏలూరు స్పోర్ట్స్ : జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, దాడులు చేసిన వారిపై వెంటనే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ … ఏలూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ నుండి ఏలూరు డిఎస్పీ కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని నినదించారు. మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెండో పట్టణ సిఐ అశోక్ కుమారుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఏలూరు జర్నలిస్టులు పాల్గొన్నారు.
