ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్ : వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన చుంచు రామకృష్ణ వైసిపి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.. చీమకుర్తిలోని బూచేపల్లి నివాసానికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. బూచేపల్లిని కలిసిన వారిలో వైసిపి బీసీ విభాగం రాష్ట్ర నాయకులు బొట్లా రామారావు, జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ సురేష్, జిల్లా నాయకులు తొట్టెంపూడి సురేష్, కుట్టుబోయిన కోటి, ఫణిదపు సుధాకర్, సురేష్, ఉలిచి గ్రామ సర్పంచి మంచు మురళి, ఎంపిటిసి పాలేటి శ్రీను, కరవది సర్పంచి దేవరపల్లి కోటేశ్వరరావు, మన్నే శ్రీను, ఐటి విభాగం నాయకులు మహేష్, మదన్, చక్రపాణి, శేషయ్య, సుధాకర్ ఉన్నారు. అనంతరం వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన చుంచు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన కమ్మ సురేష్ పలువురు వైసిపి నాయకులు, వైసిపి ఒంగోలు నియోజ కవర్గ ఇన్‌ఛార్జిచుండూరి రవిబాబును ఒంగోలులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
