కిశోర్‌తో రమణ భేటీ

May 15,2024 21:47

ప్రజాశక్తి – కురుపాం:  కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ బుధవారం భేటీ అయ్యారు. ఇండియా కూటమికి కిశోర్‌ మద్దతిచ్చిన నేపథ్యంలో బుధవారం కురుపాం కోటలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ సరళిపై చర్చించారు. కురుపాం నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి గంగు నాయుడు పాల్గొన్నారు.

➡️